రోడ్డుపై ఇసుక పోసి.. ఎంఆర్వోనే చంపాలని ప్లాన్..

మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోబోయిన నాయబ్ తహశీల్దార్ శని ద్వివేదిపై ట్రాక్టర్‌తో హత్యాయత్నం చేశారు. బేవహరి ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, నిందితులు అధికారుల వాహనాన్ని బలంగా ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించారు. వెంబడించిన పోలీసుల వాహనాలు బోల్తా పడాలనే ఉద్దేశంతో రోడ్డుపై ఇసుకను పారబోస్తూ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకోగా, ట్రాక్టర్ యజమాని కుమారుడు అధికారులను బహిరంగంగా చంపేస్తామని బెదిరించడం సంచలనం సృష్టించింది. గతంలో ఇక్కడ అధికారులను తొక్కించి చంపిన ఘటనలు ఉండటంతో, తాజా ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.