వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, చురుకైన రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో నేడు ఆకాశం మేఘావృతమై, తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడనుందని.. ఉరుముల సమయంలో ప్రజలు సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.