సినిమా వివాదం, సీబీఐ విచారణ.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో మరో సవాల్, నేడు ఏం జరగబోతోంది?

తమిళ రాజకీయ తెరపై పెను తుపాను ముంచుకొస్తోంది. ఒకవైపు సొంత పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. స్టార్ నటుడు విజయ్‌కు సీబీఐ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కరూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు బలిగొన్న భీకర తొక్కిసలాట కేసులో నేడు ఆయన ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. డీఎంకే సర్కార్ వైఫల్యం వల్లే ఆ మరణాలు సంభవించాయని విజయ్ ఆరోపిస్తుంటే.. కాదు విజయ్ నిర్లక్ష్యం వల్లే జనం బలైపోయారని పోలీసులు వాదిస్తున్నారు. దీనికి తోడు విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు సృష్టించడం రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతోంది.