ఈదురు గాలులతో భారీ వర్షం

మండలంలో బుధవారం మధ్యాహ్నం తరువాత సుమారు రెండు గంటలపాటు ఈదురు గాలులతో కుండపోతగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరిపొలాలు పూర్తిగా నిండిపోయి గట్ల మీదుగా నీరు పొర్లి ప్రవహించింది. వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో పలుచోట్ల గోతుల్లో నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఘాట్‌ రోడ్డు జంక్షన్‌ దాటిన తరువాత డి.సురవరం వద్ద రహదారిపై ఏర్పడిన భారీ గోతుల్లో నీరు చేరి పంట కుంటలుగా దర్శనమిచ్చాయి. ఎంత లోతు వుంటుందో అంచనా వేయలేక పలువురు ద్విచక్ర వాహనదారులు పక్కన వున్న ప్రైవేటు స్థలాల్లో నుంచి వెళ్లాల్సి వచ్చింది. గోతుల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సమయం రెట్టింపు అయ్యిందని పలువురు వాపోయారు.