కరాచీలో భారీ పేలుడు.. పాక్ రేంజర్స్ కార్యాలయం వద్ద కాల్పులు, ముగ్గురు సిబ్బంది మృతి!

కరాచీలోని పాకిస్థాన్ సింధ్ రేంజర్స్ కార్యాలయం వద్ద భారీ పేలుడు చోటుచేసుకుంది. ఆ దాడులకు భూమి కూడా కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు సంభవించిన తర్వాత దాదాపు 15 నిమిషాల పాటు కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనకు కారణాలను పాక్ వివరించలేదు.