కృష్ణానదిపై కొత్త బ్యారేజీ.. ఈ ప్రాంతాల మధ్యే.. సాగు, తాగునీటి కష్టాలకు చెక్!

తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణానదిపై కొల్పూరు, కోర్త్కుండా గ్రామాల మధ్య 2 టిఎంసిల సామర్థ్యంతో కొత్త బ్యారేజీ, వంతెన నిర్మాణానికి కర్ణాటక ప్రతిపాదించగా, తెలంగాణ సానుకూలంగా స్పందించింది. రూ.500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా మక్తల్‌కు సాగు, తాగునీరు అందడంతో పాటు రవాణా సౌకర్యం పెరుగుతుంది. అలాగే భీమా నదిపై తంగడిగి, సుగూరు మధ్య 0.25 టిఎంసిల బ్యారేజీని తెలంగాణ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఇరు రాష్ట్రాల ఇంజినీర్లతో ఒక సంయుక్త కమిటీ ఏర్పాటైంది.