జమ్మూలో 30 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు.. నిఘా వర్గాలు హెచ్చరిక

శీతాకాలంలోనూ జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాద ముప్పు కొనసాగుతోంది. 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలోకి చొరబడినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భారత ఆర్మీ అత్యంత కఠినమైన చలికాలంలోనూ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లను ముమ్మరం చేసింది. ప్రతికూల వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని తీవ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడకుండా నిరోధించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మంచు ఎక్కువగా కురిసే గుల్మార్గ్, సోన్‌మార్గ్‌ల్లోనూ భద్రత బలగాలు అలర్ట్ అయ్యాయి.