‘సూపర్ సిక్స్‌ను సూపర్ సక్సెస్ చేశాం. వెనుకబడిన వర్గాలను ముందుకు తేవటానికే సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను మొదటి తేదీనే ఇస్తున్నాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.‘తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రెండు విడతల్లో రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0, స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సును ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష, చర్చలు జరగాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలి... నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలి’అని సీఎం సూచించారు.అభివృద్ధి ఒకవైపు... సంక్షేమం మరోవైపు జరుగుతోంది అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు., News News, Times Now Telugu