తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రోత్సాహం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు పంటల ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం జరిగిన సమీక్షలో.. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతువేదికల ద్వారా యూరియాను పకడ్బందీగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. వాతావరణ అనిశ్చితిని తట్టుకునేలా ఇప్పటికే 18 జిల్లాల్లోని 28 లక్షల మంది రైతులకు వాట్సప్ ద్వారా ముందస్తు సమాచారాన్ని అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.