తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు, హెచ్చరికలు జారీ

తెలంగాణకు మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో అక్టోబర్ 2 నుంచి 4 వరకు రాష్ట్రంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం బలపడితే హైదరాబాద్‌లోనూ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.