తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. మరో రూ.2 వేల కోట్లు విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్‌దారుల దీర్ఘకాలిక బకాయిల చెల్లింపుల కోసం మరో రూ.2 వేల కోట్లను విడుదల చేస్తూ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం మొత్తం రూ.4 వేల కోట్ల నిధులను ఉద్యోగుల కోసం కేటాయించినట్లయింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను వంద శాతం చెల్లించి, పెండింగ్ బిల్లులు లేకుండా చేసినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేసే లక్ష్యంలో భాగంగా ఈ నిధులు విడుదలయ్యాయన్నారు.