తెలంగాణ రియల్ ఎస్టేట్‌లో వింత పరిస్థితి.. రిజిస్ట్రేషన్లు తగ్గినా.. ఆదాయం మాత్రం ఊహించని విధంగా..

తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవడానికి మార్కెట్ విలువల పెంపును నిలిపివేసినా, ఆ రంగం ఇంకా గడ్డు పరిస్థితుల్లోనే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్ వరకు) గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య సుమారు 50,000 తగ్గింది. గత ఏడాది 13 లక్షల డాక్యుమెంట్లు నమోదు కాగా... ఈసారి 12.50 లక్షలకే పరిమితమయ్యాయి. అయితే... రిజిస్ట్రేషన్లు తగ్గినా ఆదాయం రూ. 11,100 కోట్లకు పెరగడం విశేషం. హోమ్ లోన్ల కోసం రైతులు ఆస్తి విలువను ఎక్కువగా చూపడమే దీనికి కారణం. అయినప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ. 19,100 కోట్ల వార్షిక ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడం ప్రస్తుతం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.