ఫ్రెంచ్ భార్య, ఐదుగురు పిల్లలను పదేళ్లుగా చీకటి గదిలో బంధించిన పాకిస్థాన్ భర్త.. కొడుకు సాహసంతో విముక్తి!

అక్రమంగా ఆస్ట్రేలియా వెళ్లి.. అక్కడే జీవినం సాగించిన ఓ పాకిస్థానీ పౌరుడు అక్కడి మహిళతో ప్రేమలో పడ్డాడు. తన గురించి చెప్పి ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టాకా.. పాకిస్థాన్ వెళ్లిపోదామనగా అందుకు ఆమె ఒప్పుకుంది. ఇలా 2014లో పాక్ వచ్చిన ఆమెను, పిల్లలను సదరు వ్యక్తి హింసించడం మొదలు పెట్టాడు. ఒక చీకటి గదిలో బంధించి వారిని కొడుతూ, తిడుతూ నరకం చూపించాడు. ఈక్రమంలోనే వీరికి మరో ముగ్గురు పిల్లలు పుట్టగా వారికి కూడా నరకం చూపించాడు. ఇలా భార్యా, ఐదుగురు పిల్లలకు చుక్కలు చూపించిన అతడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కాపాడి షెల్టర్ హోమ్‌కు తరలించారు.