భారీగా తగ్గిన తీవ్రవాద, ఉగ్రదాడులు.. కానీ ఎక్కువైన సైనికుల మరణాలు: ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్

దేశంలో తీవ్రవాద హింస గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 2023 నివేదిక స్పష్టం చేసింది. 2022లో 446గా నమోదైన తీవ్రవాద, ఉగ్రవాద ఘటనలు 2023లో 163కి పడిపోయాయి. ముఖ్యంగా జిహాదీ ఉగ్రవాద కార్యకలాపాలలో 87 శాతానికి పైగా తగ్గింపు నమోదు అయింది. అయితే పౌర మరణాలు తగ్గినప్పటికీ.. భద్రతా సిబ్బంది (పోలీస్, ఆర్మీ) మరణాలు 50 శాతం పెరగడం, తీవ్రవాదులు దోచుకున్న ఆయుధాల సంఖ్య అనూహ్యంగా పెరగడం ఈ నివేదికలోని ఆందోళనకర అంశాలుగా నిలిచాయి.