మున్సిపల్ ఎన్నికల్లో భారీ హామీలు.. ఓటర్లకు ప్లాట్లు, కార్లు, థాయిలాండ్ ట్రిప్

పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు భారీ తాయిలాలు ప్రకటిస్తున్నారు. ప్లాట్లు, థాయ్‌లాండ్ ట్రిప్పులు, ఖరీదైన కార్లు, బైక్‌లు, పట్టు చీరలు ఇస్తామని ప్రలోభాలకు దిగుతున్నారు. వచ్చే నెల జరగనున్న ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సిద్ధాంతాలను పక్కనబెట్టి ఖరీదైన బహుమతులతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యం లావాదేవీల మార్కెట్‌గా మారుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.