"మీ పూర్వీకుల సంగతేంటి?": మోహన్ భాగవత్‌తో విందుపై ట్రోల్ చేసిన కాంగ్రెస్‌కు అద్నాన్ సమీ చురకలు

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో అద్నాన్ సమీ పంచుకున్న ఒక పూట విందు.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కాగా.. శత్రు దేశపు పైలట్ కుమారుడితో విందు ఆరగిస్తారా? అంటూ కాంగ్రెస్ దేశభక్తి రాగాన్ని అందుకుంటే.. దేశ విభజన పాపం మీ పూర్వీకులది కాదా? అంటూ అద్నాన్ సమీ చరిత్ర పుటలను తిరగేసి మరీ చురకలు అంటించారు. తన తండ్రి గతాన్ని సాకుగా చూపి విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు.. నేను రాజకీయ వేత్తను కాదు, ప్రేమను పంచే కళాకారుడిని అంటూ విమర్శలను తిప్పి కొట్టారు.