రప్పా రప్పా అని గీత దాటితే కటకటాలే...రౌడీ షీటర్లు ఇక రాష్ట్ర బహిష్కరణే: హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

రాజకీయ ముసుగులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్మాదపు చర్యలు ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టినరోజు వేడుకల పేరుతో సమాజానికి హానికరమైన సంప్రదాయాలను ప్రోత్సహించడం గర్హనీయమని ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాధారణంగా పుట్టినరోజు అంటే అన్నదానం చేయడం, రోగులకు పళ్ళు, రొట్టెలు పంచడం, రక్తదానం చేయడం లేదా గుడిలో పూజలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. కానీ వైసీపీ నాయకులు దీనికి భిన్నంగా రౌడీయిజానికి బలాన్ని ఇచ్చేలా ప్రవర్తిస్తున్నారు. కేక్ కట్ చేయడానికి చిన్న ప్లాస్టిక్ కత్తి వాడటం మన సంప్రదాయం. కానీ వైసీపీ శ్రేణులు కొడవళ్ళు, వేటకొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులతో కేక్ కట్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని హోంశాఖమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇది ఒక సైకో తత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. ‘కేవలం కత్తుల ప్రదర్శనతో ఆగకుండా...ఆ కత్తులతోనే మూగజీవాలను బలి ఇచ్చి, ఆ రక్తాన్ని తమ నాయకుడి ఫ్లెక్సీలకు అభిషేకం చేయడం అత్యంత అమానుషం. ఇలాంటి హింసాత్మక చర్యలు సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తున్నాయి’అని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.‘‘రప్పా రప్పామని నరుకుతాం. 2029లో ఇదే రిపీట్ అవుతుంది’అంటూ నినాదాలు చేయడం వారి నేరపూరిత ఆలోచనలకు అద్దం పడుతోంది. అధికారం కోల్పోయినా ఇంకా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూడటం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి, ప్రజల్లో అలజడి సృష్టించడానికి ఎంతటి నేరానికైనా వీరు వెనకాడటం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి’ అని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కోరారు., News News, Times Now Telugu