విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు, డిప్యూటీ సీఎం ప్రకటన

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్. డీఏను 1.621 శాతం పెంచుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుతో డీఏ 19.272 శాతానికి చేరింది. దీనివల్ల 70,804 మందికి లబ్ధి చేకూరనుండగా.. ప్రభుత్వంపై నెలకు రూ.9.35 కోట్ల భారం పడనుంది. అలాగే.. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని, 2035-36 నాటికి పెరగనున్న 34,137 మెగావాట్ల పీక్ డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.