2 సెకన్లలోనే 700 KMPH వేగంతో పరుగులు.. బుల్లెట్ రైలు వరల్డ్ రికార్డ్

చైనాకు చెందిన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు మాగ్లెవ్ టెక్నాలజీలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. ఒక టన్ను బరువున్న టెస్ట్ వాహనాన్ని కేవలం 2 సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టించి అద్భుతం చేశారు. సూపర్ కండక్టింగ్ అయస్కాంతాల సాయంతో పట్టాలపై గాలిలో తేలుతూ ప్రయాణించే ఈ వాహనం భవిష్యత్తులో హైపర్‌లూప్, అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించనుంది. గంటల తరబడి సాగే ప్రయాణాలను నిమిషాల్లోకి మార్చే దిశగా చైనా సాధించిన ఈ విజయం రవాణా రంగంలో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.