Punjab Blasts: పంజాబ్‌లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!

Punjab Blasts: పంజాబ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం రాత్రి గంటల వ్యవధిలోనే జరిగిన రెండు వేర్వేరు పేలుడు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. జలంధర్, అమృత్‌సర్‌లలోని రక్షణ రంగ సంస్థల (Defence Establishments) సమీపంలోనే పేలుడు సంభవించడం భద్రతాపరమైన ఆందోళనలను పెంచింది. మొదటి ఘటన రాత్రి 8 గంటల సమయంలో జలంధర్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ప్రధాన కార్యాలయం గేటు వెలుపల జరిగింది. అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక స్కూటర్ (యాక్టివా) అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, దాదాపు కిలోమీటరు దూరం వరకు పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. మంటల ధాటికి సమీపంలోని కారు అద్దాలు, దుకాణాల కిటికీలు ధ్వంసమయ్యాయి. స్కూటర్ యజమాని గుర్ప్రీత్ సింగ్ ఫుడ్ తాను డెలివరీ ఇచ్చేందుకు వచ్చి పార్క్ చేయగా ఈ ఘటన జరిగిందని తెలిపాడు. పోలీసులు దీనిని తొలుత అగ్నిప్రమాదంగా భావిస్తున్నప్పటికీ, పేలుడు కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇది ఖలిస్థానీ గ్రూప్ పనేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.