ఆసియా కప్ వీరుడికి తెలంగాణ చిరు సత్కారం .. తిలక్ వర్మను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి

ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ. పాకిస్థాన్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ యంగ్ తెలుగు క్రికెటర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆసియా కప్ టూర్ తర్వాత హైరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ.. మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మను అభినందించిన సీఎం.. చిరు సత్కారం చేశారు. అనంతరం తాను సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రికి బహూకరించారు తిలక్ వర్మ.