నా గుండె ముక్కలైంది: తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్ తొలి స్పందన ఇదే..

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి చేరుకుంది. అయితే తాజాగా ఈ ఘటనపై టీవీకే అధినేత విజయ్ స్పందించారు. ఎక్స్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన గుండె ముక్కలైందని, వర్ణించలేని దుఃఖంతో కుమిలిపోతున్నానని తెలిపారు. అయితే విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణమని డీఎంకే ఆరోపించింది. నిర్వాహకుల నిర్లక్ష్యం, విజయ్ కూడా బాధ్యులేనని పేర్కొంది. సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.