ఇకపై పిల్లలకు మొబైల్ ఫోన్లు, షార్ట్స్‌ బంద్.. సర్కారు సంచలన నిర్ణయం

ఉత్తర ప్రదేశ్‌లో సంప్రదాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఖాప్ పంచాయతీలు మరోసారి సంచలన నిర్ణయాలతో వార్తల్లోకి వచ్చాయి. మారుతున్న కాలంతో పాటు యువత దారి తప్పుతోందని.. పాశ్చాత్య పోకడలు మన సంస్కృతిని మింగేస్తున్నాయని భావించిన బాగ్‌పత్ జిల్లా ఖాప్ నేతలు.. విద్యార్థులు, యువత జీవనశైలిపై వింత ఆంక్షలు విధించారు. 18 ఏళ్ల లోపు పిల్లలు స్మార్ట్‌ఫోన్లు వాడకూడదని, అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరూ బయట షార్ట్స్ ధరించకూడదని హుకూం జారీ చేశారు. కేవలం వస్త్రధారణ, ఫోన్లకే పరిమితం కాకుండా.. ఆడంబరాలకు నిలయంగా మారిన పెళ్లిళ్లపై కూడా ఆంక్షల కొరడా ఝుళిపించారు.