గురువుపై మమకారం.. వెండి, బంగారంతో కాదు ఏకంగా రక్తంతోనే తులాభారం వేసిన శిష్యులు

సాధారణంగా తులాభారం అంటే దేవుడికో, ప్రముఖులకో భక్తితో చేసే ఒక మొక్కు. కానీ కర్ణాటకలోని హావేరి జిల్లా అక్కి ఆలూరులో జరిగిన ఈ తులాభారం మాత్రం ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు పి.ఆర్‌. మఠ్‌ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పూర్వ విద్యార్థులు ఎవరూ ఊహించని రీతిలో తమ కృతజ్ఞతను చాటుకున్నారు. తమ మాస్టారు బరువుకు సమానంగా ఏకంగా 142 యూనిట్ల రక్తాన్ని సేకరించి.. ఆ రక్తంతో రక్త తులాభారం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు.