గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు బ్రాండెడ్‌ కిట్.. తొలిసారి కాలేజీ స్టూడెంట్స్‌కు సైతం, కిట్‌లో ఏముంటాయంటే..?

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బ్రాండెడ్‌ వస్తువులతో కూడిన కిట్ అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ. 687.78 కోట్లను వెచ్చిస్తోంది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు కొత్త రంగుల్లో రెండు జతల యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులతో కూడిన కిట్లను అందజేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నాణ్యత కోసం సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్మెంట్‌ విధానాన్ని తెచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు, చేనేత కార్మికులకు భారీగా ఉపాధి లభించనుంది.