చాబహార్ పోర్టు నుంచి వెనక్కి తగ్గినా.. అమెరికా దాడులతో భారత్‌కు ఎదురుదెబ్బే

ఇరాన్, భారత్‌ల మధ్య చాబహార్ ఓడరేవు అభివృద్ధికి ఓ ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్, చైనా ప్రభావాలను నిలువరించి, వారి చర్యలను తిప్పికొట్టేందుకు వీలుగా ఈ వ్యూహాత్మక పోర్టు అభివృద్ధికి భారత్ ముందుకొచ్చింది. పాక్ గ్వాదర్ పోర్టు చైనా నిర్వహణలో ఉండటంతో చాబహార్‌కు భారత్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ క్రమంలో 2024లో ఇరుదేశాలూ పదేళ్ల కాలానికి ఓ ఒప్పందం చేసుకున్నాయి. అక్కడ మొత్తం 120 మిలియన్ డాలర్లను న్యూఢిల్లీ పెట్టుబడిగా పెడుతోంది. కానీ, అమెరికా తాజా దాడులతో ఈ ప్రాజెక్ట్‌పై భారత్‌లో ఆందోళన నెలకుంది.