తెలంగాణ ప్రజలకు ఊరట.. 3 రోజుల పాటు తగ్గనున్న చలి

Today Telangana Weather: గత నెల రోజులుగా తెలంగాణను వణికిస్తున్న తీవ్రమైన చలి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత తగ్గుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు పెరిగాయి. అయితే, పొగమంచు కమ్మేస్తుంది. దీని కారణంగా నగరాల్లో ఉన్న వారు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అలానే రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది.