నిప్పుల కొలిమిగా తెలంగాణ.. వచ్చే మూడు రోజులూ భగభగలే.. వర్షాలు ఎప్పట్నుంచంటే..?

రాష్ట్రంలో ఎండలు, వడగాలులు తీవ్రరూపం దాల్చాయి. నల్గొండలో గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 16 జిల్లాల్లోని 145 మండలాల్లో వడగాలులు వీచాయి. రాబోయే మూడు రోజులు ఎండలు ఇలాగే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. మరో వైపు ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 5 తర్వాత తెలంగాణను తాకనున్నాయన్నారు. దీనివల్ల జులై-సెప్టెంబర్ వర్షాలపై ప్రభావం పడనుందని చెప్పారు.