భూముల మార్కెట్ విలువల సవరణ.. రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం

తెలంగాణలో ఈ నెల 28 నుంచి అమలు కావాల్సిన భూముల ప్రభుత్వ విలువ సవరణ ప్రక్రియను జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేసింది. కొత్త తేదీని జూన్ 2 తర్వాత ప్రకటించనున్నారు. భూముల మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రిజిస్ట్రేషన్ల శాఖ 87 వేల ప్రాంతాల్లో కసరత్తు పూర్తి చేసింది. ఈ సవరణ ద్వారా భూముల విలువలపై 50 నుండి 70 శాతం వరకు పెంపు ఉండనుంది. వ్యవసాయ భూములను మూడు రకాలుగా.. ప్లాట్లు, అపార్టుమెంట్లను వేరే విభాగంగా వర్గీకరించి ధరలు ఖరారు చేయనున్నారు.