పంచాయతీ కార్యదర్శులకు షాకింగ్ న్యూస్.. పేస్కేల్ తగ్గింపు

ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ కార్యదర్శులకు షాకింగ్ న్యూస్. పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం 91 సవరించిన ఏపీ ప్రభుత్వం.. పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ.28280 నుంచి రూ. 25220 కి తగ్గించింది. పంచాయతీ కార్యదర్శులను ఇటీవల గ్రేడ్ 4,5ల నుంచి గ్రేడ్ 3కి అప్ గ్రేడ్ చేసిన ఏపీ ప్రభుత్వం.. వారి పేస్కేలును రూ.28280లకు పెంచుతూ జీవో 91 విడుదల చేసింది. తాజాగా జీవో 91 సవరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ.25220లకు తగ్గిస్తూ జీవో 60 విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో 60ను ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.