ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు.. జరిమానా తగ్గించిన ప్రభుత్వం, ఇకపై ఎంత కట్టాలంటే?

ప్రతిరోజూ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం రెండు శుభవార్తలను అందించింది. నవంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా, లేదా అది పని చేయకపోయినా ఇకపై రెట్టింపు జరిమానా కట్టాల్సిన అవసరం లేదు. భారీ ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తూ.. సాధారణ టోల్ ఛార్జీ కంటే కేవలం 1.25 రెట్లు మాత్రమే చెల్లించే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా మీ ట్యాగ్ సరిగ్గా ఉన్నా, టోల్ ప్లాజా వద్ద యంత్రాలలో సాంకేతిక లోపం ఉంటే ఒక్క రూపాయి కూడా కట్టకుండా దాటివెళ్లొచ్చు.