బంగ్లాదేశ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. ఫిబ్రవరి 12న పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?

బంగ్లాదేశ్ రాజకీయాల్లో నిరీక్షణకు తెరపడింది. మాజీ ప్రధాని షేక్ హసీనాను రాజీనామా చేయమని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఆందోళనల అనంతరం.. అక్కడ తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కీలక అడుగు పడింది. 2026 ఫిబ్రవరి 12వ తేదీన దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) ప్రకటించారు. అత్యంత ముఖ్యంగా ఈసారి ఎన్నికలతో పాటు దేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన జులై నేషనల్ చార్టర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ కూడా అదే రోజు జరగనుంది.