బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. బంగ్లాదేశ్ గుండెల్లో గుబులు.. ఎంపీ వీడియో వైరల్

పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మొగ్గు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు బంగ్లాదేశ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే శరణార్థుల సంక్షోభం తప్పదని ఆ దేశ ఎంపీ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక, ఎన్నికల్లో అక్రమ చొరబాట్లు అంశం ప్రచార అస్త్రాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చొరబాటుదారులను బెంగాల్ నుంచి తరిమేస్తామని బీజేపీ ప్రచారం చేసింది. టీఎంసీ సైతం ఇదంతా బీజేపీ డ్రామా అని, ఈ విషయంలో కేంద్రం నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోందని ఎదురుదాడి చేసింది.