మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల ఎదురు చూపులు!

మధ్య పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. తొలకరి వర్షాలను నమ్ముకుని పత్తి, కంది వంటి పంటల విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తకపోవడంతో పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు, ఎల్నినో ప్రభావం 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని ఇన్కోయిస్ తాజా బులెటిన్లో పేర్కొనడంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులు వ్యవసాయం, సముద్ర వాతావరణ వ్యవస్థలు, మత్స్య సంపదపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..