మహారాష్ట్రలో వరద బీభత్సం.. పాతాళగంగలో కొట్టుకుపోయిన 3,000 గ్యాస్ సిలిండర్లు.. హై అలర్ట్ జారీ!

భారీ వర్షాల ధాటికి రాయ్‌గఢ్ జిల్లా పన్వేల్‌లోని హెచ్‌పీసీఎల్ పాతాళగంగ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ప్లాంట్‌లో ఉన్న సుమారు 3,000 గ్యాస్ సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. ఈ ఘటనపై స్పందించిన రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ కిషన్ జవాలే.. నదిలో కొట్టుకొచ్చే సిలిండర్లను తాకడం, ఇళ్లకు తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరమని, ప్రజలెవరూ వాటిని ముట్టుకోవద్దని హెచ్చరించారు. సిలిండర్లను రికవరీ చేసేందుకు అధికారులు నదీ తీర ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.