వర్షాలతో నష్టపోయిన రైతులకు బిగ్ రిలీఫ్.. మంత్రి కీలక ఆదేశాలు..

ఏపీవ్యాప్తంగా పలుచోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ప్రజలు ఉక్కబోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే రైతుల పరిస్థితే ఇబ్బందికరంగా మారింది. చేతికందిన పంట వానకు తడవకుండా ఉండేందుకు అనేక తిప్పలు పడుతున్నారు. కొన్నిచోట్ల వర్షానికి తడిచిన ధాన్యాన్ని ఆరబోసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఉపశమనం కలిగిస్తూ మంత్రి కందుల దుర్గేష్ రైస్ మిల్లర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తేమ శాతం 25 వరకూ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.