అంతర్జాతీయ స్థాయిలో పాక్ పరువు తీస్తున్న యాచకులు.. 56 వేల మందిపై సౌదీ వేటు

అసలే ఆర్థిక సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్‌కు గల్ఫ్ దేశాల నుంచి ఊహించని షాక్ తగిలింది. ఉమ్రా, పర్యటక వీసాల పేరుతో సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలకు వెళ్లి.. అక్కడ వ్యవస్థీకృత ముఠాలుగా ఏర్పడి భిక్షాటనకు పాల్పడుతున్న వేలాది మంది పాక్ పౌరులను ఆయా దేశాలు దేశం నుంచి వెళ్లగొట్టాయి. ఒక్క సౌదీ అరేబియానే ఇప్పటి వరకు ఏకంగా 56,000 మంది పాకిస్థానీ భిక్షగాళ్లను బహిష్కరించింది.