పాకిస్థాన్‌కు గట్టి షాక్: జనాభా పెరుగుతున్నా కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు IMF నో

ఒకవైపు ఆకాశాన్నంటుతున్న ధరలు, మరోవైపు అదుపులేకుండా పెరుగుతున్న జనాభా.. వెరసి పాకిస్థాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. దేశంలో ఏటా 60 లక్షల మంది కొత్త జనాభా చేరుతుండటంతో.. జనాభా నియంత్రణ సాధనాలను చౌకగా అందించాలని భావించిన పాక్ ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కోలుకోలేని దెబ్బకొట్టింది. కండోమ్‌లు, శానిటరీ ప్యాడ్లు, చిన్నారుల డైపర్లపై విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని వెంటనే రద్దు చేయాలన్న ఇస్లామాబాద్ అభ్యర్థనను ఐఎంఎఫ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.