ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ రద్దు, ఎందుకంటే?

అదృష్టం కొద్దీ అమెరికాలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డ్ లాటరీకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరమగీతం పాడారు. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన నిందితుడు.. ఈ లాటరీ విధానం ద్వారానే దేశంలోకి అడుగుపెట్టాడన్న చేదు నిజం అగ్రరాజ్య భద్రతా విధానాలనే మార్చివేసింది. ఇకపై నేరగాళ్లకు మన దేశంలో చోటు లేదు అంటూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఇచ్చిన ఆదేశాలతో డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ చరిత్రలో కలిసిపోయింది. ఏటా వేలాది మంది విదేశీయులకు ఆశాదీపంగా నిలిచిన ఈ వ్యవస్థను.. దేశ భద్రత కోసం త్యాగం చేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది.