అవి బియ్యమో, తాలింపు గింజలో కావు.. నిజమైన పురుగులు: మధ్యాహ్నం భోజనంలో చిన్నారుల ఆవేదన

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తక్షణమే ఆహార ధాన్యాలను తనిఖీ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.