"ఈ ఫోన్ బంగ్లాదేశీయులను పట్టేస్తుంది": యూపీ పోలీసుల వింత వాదన, వైరల్ వీడియోలో నిజమెంత?

టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణలు వస్తుంటాయి.. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు వాడిన టెక్నాలజీ చూస్తే శాస్త్రవేత్తలు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే! అక్రమ వలసదారులను గుర్తించే క్రమంలో ఘజియాబాద్ పోలీసులు చేసిన ఒక వింత ప్రయోగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సూపర్ మార్కెట్‌లో వస్తువులను స్కాన్ చేసినట్లుగా.. ఒక వ్యక్తి వీపుపై మొబైల్ ఫోన్ ఉంచి బంగ్లాదేశీ గుర్తింపు తనిఖీ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మా దగ్గర ఒక మిషన్ ఉంది.. ఇది మీ వీపుపై పెడితే మీరు ఏ దేశస్తులో తెలిసిపోతుంది అని పోలీసులు తమను నమ్మబలికారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.