కూలి పని కోసం వస్తూ.. బొలెరో, లారీ ఢీకొని ముగ్గురు మృతి
రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మహిళా కూలీలు చనిపోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది.