తిరుపతి తాగునీటి సమస్యలకు చెక్.. రూ.126 కోట్ల ప్రాజెక్టు.. సీఎం సొంతూరికి మహర్దశ

సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుపతితో పాటు సొంతూరిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తిరుపతి తాగునీటి కష్టాలు తీర్చడం కోసం రూ.126 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు, రూ.70 లక్షలతో రోడ్డు, రూ.1.4 కోట్లతో స్కిల్ బిల్డింగ్ సెంటర్, ఆసుపత్రి, హాస్టల్స్, పరిశోధన ల్యాబ్‌లకు శంకుస్థాపనలు చేశారు. నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. దేవాంశ్ ఆటలు చూసి మురిసిపోయారు.