పాతికేళ్ల నుంచి ప్రభుత్వ టీచర్లుగా ఉన్నవారు ఇప్పుడు టెట్ పాస్ కావాలా.. ఇది అన్యాయం? : వైఎస్ జగన్

ప్రభుత్వ టీచర్లు అందరూ తప్పనిసరిగా టెట్ పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. పాతికేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను ఇప్పుడు పరీక్ష రాసి పాస్ కావాలని చెప్పటం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని.. రాష్ట్రంలోని లక్ష మందికి పైగా ఉపాధ్యాయుల బాధలను, ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. 2011 కంటే ముందే విధులలో చేరిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.