హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రి వైద్యుల మరో సాహసం.. 5వ అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జన్మ

భవనం 5వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 13 ఏళ్ల బాలుడికి హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు అద్భుత వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారు. తీవ్ర బృహద్ధమని గాయం, మెదడు గాయం, బహుళ అవయవాల వైఫల్యంతో పోరాడిన బాలుడిని వైద్యులు సమిష్టి కృషితో కాపాడగలిగారు. వారాల పాటు వెంటిలేటర్, డయాలసిస్, ప్రత్యేక ఐసీయూ చికిత్సల అనంతరం బాలుడు కోమా నుంచి కోలుకుని పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి స్వయంగా గీసిన కళాఖండాన్ని బహుకరించి కృతజ్ఞతలు తెలియజేయడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది..