ప్రశాంత్ కిషోర్‌ కంటే ఆయన భార్యే చాలా రిచ్.. ఆమె పేరుతో రూ. 100 కోట్లకుపైగా ఆస్తులు

గతేడాది నవంబరులో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ కనీసం ఒక్క సీటును గెలుచుకోలేదు సరికదా.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. తాజాగా, ఆ రాష్ట్రంలో జరుగుతోన్న ఉప-ఎన్నికల్లో పీకే పోటీచేస్తున్నారు. ఆయన తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దీంతో సోమవారం ప్రశాంత్ కిషోర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన పేరుతో రూ. 96 కోట్లు ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఆయన భార్యకు పీకే కంటే భారీగా ఆస్తులు ఉన్నాయి.