పోలీసులు పట్టించుకోకున్నా.. పోయిన ఫోన్‌ కోసం టెకీ ట్రాక్.. వారణాసికి వెళ్లి మరీ..!

మీ ఫోన్ పోయిందా? అయితే మర్చిపోండి అనే పోలీసుల మాటలకు ముంబై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంకితా గుప్తా చెక్ పెట్టారు. వారణాసిలోని అస్సీ ఘాట్‌లో తన మొబైల్ చోరీకి గురైతే.. పోలీసులు ఎఫ్ఐఆర్ రాసి చేతులు దులుపుకున్నారు. కానీ ఆ టెక్కీ మాత్రం తన సాఫ్ట్‌వేర్ నైపుణ్యంతో దొంగకు సినిమా చూపించారు. గూగుల్ మ్యాప్స్ లోకేషన్ ఆధారంగా గల్లీ గల్లీ వెతికి.. ఏకంగా దొంగల స్థావరాన్నే ముట్టడించి పోలీసులకే లొకేషన్ పంపారు. ఆమె తెగింపు చూసి అవాక్కైన పోలీసులు రంగంలోకి దిగగా.. అక్కడ అంకిత ఫోన్‌తో పాటు మరో డజనుకు పైగా చోరీ మొబైల్స్ లభ్యమయ్యాయి.