భారత్ - అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్‌డీల్... వాణిజ్య సుంకాలు భారీగా తగ్గింపు

భారత్ – అమెరికా మధ్య కీలకమైన ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా అధికారిక ముసాయిదాను విడుదల చేసింది.అటు రెండు దేశాల మధ్య పరస్పర, సమతుల్య వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదాను భారత్ సైతం విడుదల చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయడానికి అంగీకరించినట్లు అమెరికా పేర్కొంది. భవిష్యత్తులో అమెరికా నుంచి ఇంధనం, గ్యాస్‌ను పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాలని భారత్ నిర్ణయించిందని వైట్ హౌస్ పేర్కొంది. ఈ క్రమంలో భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లుగా వెల్లడించింది. అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయం వంటికీలక రంగాల్లో అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. అంతేకాదు ఈ ఒప్పందం విజయవంతమైతే భవిష్యత్తులో పరస్పర సుంకాలను పూర్తిగా తొలగించే దిశగా అగ్రరాజ్యం అమెరికా అంగీకరించింది., News News, Times Now Telugu