రాజ్యసభలో రిచ్చెస్ట్ ఎంపీలు మనవాళ్లే.. టాప్‌లో BRS ఎంపీ, లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ADR) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువలో తెలుగు రాష్ట్రాల ఎంపీలదే పైచేయిగా నిలిచింది. దేశవ్యాప్తంగా 226 మంది సిట్టింగ్ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.26,047 కోట్లు కాగా.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 మంది ఎంపీల సంపదే 39.39 శాతం అంటే రూ.10,259 కోట్లు ఉండటం గమనార్హం. ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల ఆస్తులు రూ.8,310 కోట్లుగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రూ.5300 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా నిలిచారు. అలాగే తెలంగాణ ఎంపీల్లో 71 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.