రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లోని వెజ్ బిర్యానీలో ఈగ.. క్యారటింగ్ సంస్థకు రూ.1 లక్ష జరిమానా, లైసెన్స్ రద్దుకు నోటీసులు

ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లకు అందించే ఆహార నాణ్యతాలోపంపై ఐఆర్‌సీటీసీ మరోసారి కఠిన వైఖరిని ప్రదర్శించింది. అహ్మదాబాద్‌-ముంబయి తేజస్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో ఈగ రావడంతో తక్షణ చర్యలు తీసుకుంది. ఈ తీవ్ర నిర్లక్ష్యానికి కారణమైన అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రూ. 1 లక్ష భారీ జరిమానా విధించింది. అక్కడితో ఆగకుండా లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ సదరు సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.